Tuesday, June 24, 2014

ఆరంభమే అదిరిపోతోంది

ఆరంభమే అదిరిపోతోంది (From Andhrajyoti)


హామీల అమలు చూడండి
రుణమాఫీపై కాలయాపన కమిటీలు ఎందుకు?
విభజన తర్వాతా జీడీపీ బాగా ఉంది
ఐటీ లేకున్నా ఇతర వనరులున్నాయి: జగన్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం లేకున్నా మిగతా పరిశ్రమలు ఉన్నాయి. ఓడరేవులు, విశాఖ ఉక్కు వంటివి మనకున్నాయి. వాటిని ఆధారం చేసుకుని మనం ఎదగాలి. విడిపోక ముందు ఉన్న జీడీపీతో పోలిస్తే ఇప్పటి ఏపీ జీడీపీ 58.97 శాతంగా ఉంది. ఇది అంత తక్కువేమీ కాదు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా రెవెన్యూ లోటు ఉన్నట్లు చెబుతోంది. ఇది ఆ పార్టీ ఇచ్చిన హామీల వ్యయంతో కలిపా? లేక వాటికి నిధులు కేటాయించక ముందే ఈ లోటు ఉందా? ఈ విషయం స్పష్టం చేయాలి.
హైదరాబాద్, జూన్ 23 : తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విపక్షనేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ఆయా వర్గాలు ఎదురు చూస్తున్నాయని గుర్తించాలన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం అసెంబ్లీలో జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, ఆ పార్టీ జారీ చేసిన ప్రకటనలు, కరపత్రాలు, ఇతరత్రా పత్రాలు చూపిస్తూ... గణాంకాలు ప్రస్తావిస్తూ, అక్కడక్కడ కాస్త వ్యంగాన్ని జోడిస్తూ జగన్ ప్రసంగం సాగింది. ఆచరణ సాధ్యం కాదని నిర్ధారించుకున్నందునే తాము వ్యవసాయ రుణాల మాఫీ గురించి ప్రకటించలేదని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు మాఫీ ఫైలుపై సంతకం చేస్తారని భావించగా... ఆయన మాత్రం కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయని... ఖరీఫ్‌లో రుణాలకోసం వెళ్తుంటే పాత బకాయి తీర్చకుండా, కొత్త అప్పులు ఇవ్వడంలేదని జగన్ గుర్తు చేశారు. వీటితోపాటు డ్వాక్రా రుణాలు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతిపై టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగన్ కోరారు. వాటికి గడువు పెంచడం, కమిటీలు వేయడం సరికాదన్నారు. మంచి పనులు చేస్తే ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి మద్దతిస్తామని తెలిపారు. తన తండ్రి వైఎస్ పాలనను గుర్తు చేశారు. "గవర్నర్ తన ప్రసంగంలో విభజన వల్ల వచ్చిన నష్టాల గురించి ప్రస్తావించారు. ఆ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. ఇదంతా మేం అప్పుడే చెప్పాం.
విభజన బిల్లుకు ఓటు వేయొద్దని మొత్తుకున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం లేకున్నా మిగతా పరిశ్రమలు ఉన్నాయి. ఓడరేవులు, విశాఖ ఉక్కు వంటివి మనకున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఎదగాలి. విడిపోక ముందు ఉన్న జీడీపీతో పోలిస్తే ఇప్పటి ఏపీ జీడీపీ 58.97 శాతంగా ఉంది. ఇది అంత తక్కువేమీ కాదు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా రెవెన్యూ లోటు ఉన్నట్లు చెబుతోంది. ఇది ఆ పార్టీ ఇచ్చిన హామీల వ్యయంతో కలిపా? లేక వాటికి నిధులు కేటాయించక ముందే ఈ లోటు ఉందా? ఈ విషయం స్పష్టం చేయాలి'' అని జగన్ డిమాండ్ చేశారు. అంతా బ్రహ్మాండంగా ఉందనడం సరికాదని, కేంద్రం నిధులు రాకపోతే అందుకు విపక్షమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సమయంలో సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనిపై జగన్ స్పందిస్తూ... "నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్లడమే నాయకత్వం. అందుకే సీమాంధ్రలో ఉన్న పరిశ్రమలు, రెవెన్యూ పెంచుకోడానికి మనకుగల అవకాశాల గురించి చెబుతున్నాను'' అని తెలిపారు. విభజనవల్ల మనకు అన్యాయం జరిగిందనే వాళ్లు బిల్లు పార్లమెంటుకు వచ్చినపుడు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. విభజన బిల్లు పార్లమెంటుకు వచ్చినపుడు తాను ప్రతిఘటిస్తే..కాంగ్రెస్ ఎంపీలు తనపై దాడికి దిగారని, అపుడు జగన్ ఏమీ మాట్లాడలేదని మోదుగుల గుర్తు చేశారు.
రుణమాఫీ చేయండి: వెంటనే రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని జగన్ కోరారు. దీనిపై మళ్లీ కమిటీలు వేయాల్సిన పనిలేదని... రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రచురించిన నివేదికలోనే డ్వాక్రా రుణాలు, పంట రుణాలు, వాటికి సంబంధించిన ఖాతాల సంఖ్యపై స్పష్టత ఉందన్నారు.
కేంద్రం నుంచి నిధులు రాబట్టండి: 14వ ఆర్థిక సంఘానికి మన రాష్ట్ర పరిస్థితిని వివరించి మరిన్ని నిధులు రాబట్టాలని, గత ప్రధాని ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రధాని మోదీ అమలు చేసేలా చూడాలన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని, ఇపుడు ఉపాధిహామీ, జలయజ్ఞం, హౌసింగ్‌లో వేలాది మందిని తీసేసేందుకు నోటీసులు ఇచ్చారని, అలాగే ఆదర్శ రైతులు 24 వేల మందిని తొలగిస్తూ నోటీసులు వచ్చాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రుల్లో చికిత్సలు చేయడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏమైందని జగన్ ప్రశ్నించారు. పల్లెల్లో 15 గంటలకుపైగా కరెంటు కరెంటు కోత విధిస్తున్నారన్నారు.
సింగపూర్‌లా రాజధాని కడితే సంతోషిస్తాం: రాజధాని ఎక్కడ పెట్టినా కనీసం 30 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండాలని జగన్ కోరారు. "ఏపీలో సింగపూర్ స్థాయి రాజధాని కట్టిస్తామనిబాబు చెప్పారు. అలా కట్టించండి మేమూ సంతోషిస్తాం'' అని పేర్కొన్నారు. జగన్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారానికి వాయిదా వేశారు.

No comments: