విజయవాడ కనకదుర్గాదేవి ఆలయం
(Vijayawada Kanakadurga Devi Temple)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ మహా శక్తి స్వరూపిణి. ప్రకాశం బ్యారేజి స్నాన ఘట్టానికి సమీపంలో కనకదుర్గ
స్థల పురాణాన్ని అనుసరించి విజయవాడ కనకదుర్గ ఆలయ కథనం ఇలా ఉంది...
త్రిమూర్తుల తేజోకాంతులతో అవతరించిన మహా శక్తి స్వరూపిణి మహిషాసురుని వధించింది. భవిష్యత్తులో ఊహించని ఆపదలు వచ్చినప్పుడు తమను కాపాడేందుకు అందుబాటులో ఉండమని దేవతలు, మునులు ప్రార్ధన చేయగా ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకుంది.
మరో కథనం ప్రకారం -
సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా సతీదేవి పరమేశ్వరుని పెళ్ళి చేసుకుంది. శివుడు ఏమీ లేని బికారి అని, స్మశానంలో తిరుగుతాడని, శరీరంమీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు. తాను ఎంతగా చెప్పినా వినకుండా కూతురు శంకరుడినే పెళ్ళి చేసుకోవడంతో చాలా కోపం వచ్చింది. ఒక సందర్భంలో దక్షుడు మహా యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి అందర్నీ ఆహ్వానించాడు కానీ సొంత కూతుర్ని, అల్లుడిని పిలవలేదు.
తండ్రి యజ్ఞానికి పిలవనందుకు సతీదేవి చాలా బాధపడింది. కానీ తనకు తానే సర్దిచెప్పుకుని, పుట్టింటివాళ్ళు పనిమాలా పిలిచేదేమిటి, తానే వెళ్ళాలి అనుకుంది. మహాశివుడు వద్దని వారిస్తున్నా, వినకుండా, ఒప్పించి వెళ్ళింది. తీరా సతీదేవికి అక్కడ సంతోష స్వాగత వచనాలు కాదుగదా కనీసం ''అమ్మా, వచ్చావా'' అనే పలకరింపు కూడా కరువైంది. పైగా దక్షుడు పరమేశ్వరుని తూలనాడుతూ మాట్లాడి, నలుగురిముందూ ఎంతగానో అవహేళన చేశాడు. సతీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. తక్షణం యజ్ఞగుండంలో దూకేసింది.
విజయవాడ కనకదుర్గ ఆలయం మహా మహిమాన్వితమైంది. అమ్మవారి చలవతో మొక్కులు నెరవేరుతాయని స్థానికులు తమ అనుభవాలను చెప్తారు. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత ఆవరిస్తుంది. అలజడులు, ఆందోళనలు మటుమాయమై అంతులేని ఆనందం అనుభూతికొస్తుంది.
దసరా నవరాత్రుల మహోత్సవాలకు దేశం నలుమూలల నుండీ లక్షలాదిమంది భక్తులు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకుని తరిస్తారు.