Wednesday, July 31, 2013

Gone is gone. Let us come together and develop our cities. Prove Andhras are great



                             వీళ్ళగురించి అలొచించద్దు ... సవాల్ గా తీసుకొని అభివృద్ధి చేసుకొందాం



చాలా రోజులనుంచి నలుగుతూన్న తెలంగాణా సమస్యకు ఎట్టకేలకు డాక్టర్ మంమోహన్సింగ్ ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని సూచించింది. తెలుగు వాళ్ళు కొట్టుకుచావడం ఇంకా కొంత కాలం చూడాలన్న స్వార్ద పరుల ఆశలకు మాత్రం కళ్ళెం పడింది .  తెలుగు వారి ఆంధ్ర ప్రదేశ్ రెండుగా చీలిపోవడం వరకు కొంత బాధ కలిగించ వచ్చేమో కాని తెలుగు మాట్లాడే వారికి ఇదేమి పెద్ద ఇబ్బంది కలిగించే విష్యం కాదని నా ప్రఘాడ నమ్మకం .
ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోతే .... కాదు కాదు హైదరాబాద్ లేనంత మాత్రాన ఆంధ్ర తెలుగు వారు బతకలేరని కొంతమంది రాజకీయనాయకులు గగ్గోలు పెట్టడం చూస్తుంటే తెలుగు వాడిగా అన్దులోను కృష్ణ జిల్లా వాసిగా నాకు సిగ్గే స్తోంది . హైదరాబాద్ ఒక్కటే ప్రపంచం అయినట్టు అది లేకుంటే నిద్ర పట్టనట్టు పలు రాజకీయ పార్టీల లాయకులు మాట్లాడం ఏమాత్రం బాగున్దలెదు.  మళ్లీ హైదరాబాడును మేమే అభివృది చేసామంటూ గొప్పలు చెప్పుకొనే వీరు ఏనాడైనా విజయవాడను గాని విసఖను గాని అభివృద్ది చేయాలని ఎందుకు అనిపించలేదు? కోస్త జిల్లాల గుండెకాయ అయిన విజయవాడ అక్కర్లేనప్పుడు వీరందరూ ఇప్పుడు వెనుకబదిపోయమంటూ మొసలి కన్నీరు కారుస్తున్నరు.
తెలంగాణా ఉద్యమం గత కొన్ని దశాబ్దాలుగా మరీ 12 సంవత్త్సరాలనుంచి తీవ్రంగా ఉన్ది. మరి అప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నారా చంద్రబాబు నాయుడు గారే కదా పరిపాలించింది . ఆయనకు విజయవాడ, విశాఖ లాంటి నగరాలను కూడా అభివృధి చేయాలనీ ఎందుకు అనిపించలేదు ? ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు కదా?
ఆయనకు హైదరాబాద్ తప్పించి వేరే నగరాలన్నీ పనికిరానివి . హైదరాబాద్ లాగ ఇతర నగరాలకు కూడా infrastructure డెవలప్ చేయాలనీ ఏనాడన్నా అనుకొన్నారా ? NTRamaRao వల్ల ఆమాత్రమైన Health University వచ్చింది గాని లేకుంటే అదీ వచ్చేదేనా?
చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలం అంతా హైదరాబాదు లేదా విశాఖపట్నం. కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాలంటే ఆయనకు పట్టేదిగాదు. అక్కడ చేసినా చేయకున్నా తన సామాజిక వర్గం వారు వారికే వోట్లేస్తారని అనుకొనే వాడు. ఆవిధంగా విజయవాడ ప్రతిస్తానంత పడు చేసి మురికి మున్సిపాల్టీగా తయరుచెశాడు.
అదృష్టం ఉంది 2004లో పరాజయం పాలయ్యాడు గాబట్టి YS రాజశేఖర రెడ్డి పుణ్యమా అంటూ కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది గాని లేకుంటే ఈ రోజుకు అక్కడ ర్ప్పుడున్నత మాత్రం కూడా ఉండేదీ కాదు.
ఇవాళ విజయవాడ Airport లో కాస్త పెద్ద విమానాలు (ఎయిర్ బస్సు ) వస్తున్నాయంటే ఆనాడు ఆయన శ్రద్ధ వహించి Runway ను 7500 Feet లకు చేయించడమే. అదేవిధంగా  ITTOWER ను కట్టాడు . అయన  చ చనిపొఇన్తరువాత దానిలోకి ITCompanies ను తీసుకోచేవారే లెకపొయరు. అలాగే విజయవాడ ,హైదరాబాద్ ల మధ్య Fourlane highway వచ్చింది .
ఎన్టీఆర్ కూతురు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా సొంత జిల్లాను మరవకుండా School of Archtecture and planning స్కూల్ తెచ్చింది. దానికి పది ఎకరాల స్తలం ఇవ్వలేక సతమతమవుతున్నరు.
ఇక Prliament Member లగడపాటి రాజగోపాల్ గారి గురించి ఎంత తక్కివ చెప్పుకొంటే అంత మంచిది . ఆయనకు అసలు విజయవాడ అంటేనే గిట్టదు. మెగా నగరంగా విజయవాడను అభివృద్ధి చేద్దామంటే చుట్టుపక్కల గ్రామాలు కలిపే   సమయం ఆసన్నం కాలేదని అంటాడు . మరో పక్కన విశాఖపట్నం లో50 కిలోమీటర్ల దూరంలోని అనకాపల్లి,భీమునిపట్నం కలిపేస్తున్నారు. అయినా రాజగోపాల్ కు మాత్రం చీమకుట్టినట్టు కూడా ఉండదు .
ఇటువంటి వారు ఉంటె ఆంధ్ర ఎప్పటికి బాగు పడెను? కాబట్టి ఇప్పుడు ఆంధ్ర తెలుగు వారికి మంచి అవకాసం వచ్చింది ఇటువంతివారినదరిని ఓడించడానికి . మనకు మంత్రి పదవులకు ఆశ పడిన కావూరి సాంబశివ రావు, రాయపాటి  సంబసివ రావు లాంటి వారు ఉన్నంత వరకు మన ఆంధ్ర తెలుగు వాళ్ళు వారుణ దేవుడుకు దణ్ణం పెట్టుకొంటూ వర్షాలు పడితే చాలు కనీసం పంటలన్నా పండుతాయని అనుకొంటారు. ఇప్పుడు పాఠాలు నేర్చుకొన్న తరువాతైనా కొత్త రాజకీయ నాయకులు వచ్చి ఆంధ్రా ప్రాంతాన్ని చైనా వారి లాగ పట్టుదలతో ఎంత త్వరగా హైదరాబాద్ను చేరుకోగాలమో చేసి చూపించాలి .