కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లి తనని ఎవరు చూడలేదని అనుకొన్నట్లు తెలుగుదేశం అధ్యక్షులు నార చంద్ర బాబు నాయుడు గారు తన అవినీతి గురించి ఎవ్వరకి తెలియదన్న ధైర్యం తో ఉంటారు. భాహిరంగాసభ గాని విలేఖరుల సమావేశం గాని పెడితే చూపుడు వేలు చూపిస్తూ అవినీతిమీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. తాను ఎంతో నీతిపరుడినని చెప్పుకొన్తుంటారు. ఇది అంత అవసరమా అని కనీసం ఆలోచించరు. తను చెప్పేదంతా నిజమో కాదో ప్రజలు తెలుసుకోలేనంత అమాయకులని ఆయన భావన. ఎదుటివాల్లంతా అవినీతిపరులని రామోజీ రాతలులాగా ఆయన నమ్మకం. అలా మాట్లాడుతూవుంటే ఎప్పటికైనా మళ్ళీ తనను గద్దె నేక్కించక పోతారా అని ఆయన అనుకొంటారు. ఎంత చెప్పినా మానవుడి జ్ఞాపక శక్తి అంత అమోఘమైనది కాదని ఆయన భావన.
నిన్న గాక మొన్న ఆస్తులను ప్రకతిసున్ననంటూ తనకొక డొక్కు అంబాసడర్ కార్ ఉందంటూ తన బీదరికాన్ని తెగ ప్రచారం చేసుకొన్నారు. అంతలో సి బి ఐ వాళు తన కోడలికి కోటి ఇరవై లక్షలు విలువచేసే రెండు పెద్ద విల్లాలు ఉన్నాయని దానిని మార్కెట్ రేట్ కంటే ఎలా తక్కువకు కొన్నరంటూ నోటీసు ఇవ్వగానే విలేఖరులు ....మరి మొన్న ఆస్తులు ప్రకటించినపుడు ఇది చెప్పలేదు గా అని అడిగితె వాళ్ళ నాన్న బాలకృష్ణ కొని ఇచ్చాడేమో నాకు తెలియదంటూ చెప్పిన చంద్రబాబుని ఏ పిచ్చివాడైన నమ్ముతాడా?
ఇంత నిఖార్సైన చంద్రబాబు అవినీతి మీద విద్యార్ధుల ముందు ఉపన్యాసాలు ఇస్తాడు...తెలుగు ప్రజల ఖర్మ కాకపొతే ఏమిటి? తన సొంత మామే నా అల్లుడు చంద్రబాబు పచ్చి అవినీతి పరుడని ప్రజలకు చెప్పనే చెప్పారు. ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? అధికారం కోసం ఎటువంటి మాటలనైన మాట్లాడ గల నీతి మాలిన వ్యక్తిగా మారిపోయాడని తెలుగు ప్రజలు అనుకొంటున్నా అదికూడా పట్టించు కోని చంద్రబాబు ఎప్పటికి మారేను?
ఇప్పటికైనా తన్నాను ప్రజలు విశ్వసించటం లేదని తెలుసుకొని తెలుగు ప్రజలను మోసం చేసి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశానని అనుకొని అధికార వ్యామోహాన్ని వదలి బ్లాకు కాట్స్ లేకుండా ప్రజల కు చేరువవుతూ వారికి సేవ చేసుకొంటే ఎప్పటికైనా వారి విశ్వాసాన్ని పొందవచ్చు.
చంద్రబాబు నీవు చెప్పే నీతి కథలు ఎవ్వరూ వినేపరిస్తితిలో లేరు. నిప్పు లేనిదే పోగారాదన్నట్లు నీవు అవినీతితో వేల కోట్లు సంపాదించావు కాబట్టే అందరు నిన్ను అవినీతి పరుడని అంటున్నారు. ఇంకో విషయం...నీకు రామోజీరావు, రాధక్రిష్నల అవినేతీ ....అవినీతిగా కనపడదు. వాళ్ళు దేసోధారాకులు. నీ కీ అంత వాళ్ళ చేతిలో ఉందేమో , ఎప్పుడు వాళ్ళకు కొమ్ము కాస్తుంటావు.
ప్రజలు నిన్ను నమ్మాలంటే నీ ఆస్తిని కనీసం మొన్నేమధ్య నీవు ప్రకటించన ఆస్తినైనా ప్రజలకు ధారాదత్తం చేస్తే కొంతైన ప్రజలు నమ్మడం మొదలుపెదతరేమో ?
No comments:
Post a Comment