జూన్లో జరగబోయే ఉప ఎన్నికలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కి పరీక్షగా నిలుస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు కు
కూడా ఈ ఉప ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. ఈ ఎన్నికలలో ఎంతోకొంత విజయం సాధిస్తేనే గాని కార్యకర్తలు, నాయకులూ చంద్రబాబు మీద విశ్వాసం ఉంచే టట్లు కనపడడం లేదు.
కేవలం జగన్మోహనరెడ్డి ని ముఖమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ని తిడితే ప్రజలు వోట్లు వేస్తారనే ధోరణిలో చంద్రబాబు ఉన్నాడు. తానొక్కడే సత్య హరిచంద్రుడని మిగతా వారందరూ పచ్చి అవినీతి పరులని ఆయన తన ఉపన్యాసాలలో ప్రజలకు ఎంతగా వివరించినా ప్రజలు నమ్మడం లేదు. ఈ మధ్య ఇంకా ముందుకెళ్ళి ముఖ్యమంత్రి వట్టి వెధవని, ఎందుకు పనికిరాడని తానొక్కడే తెలివిగలవాడినాని ఎంత చెబుతున్న ఎందుకో ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంత గా మొట్టుకొంటున్నా ప్రజలు నమ్మడం లేదని తెలుసుకొని తన ఉపన్యాస ధోరణిని మార్చుకొని చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుకొంటున్నారు.
చంద్రబాబు ఉపన్యాసంలో పటుత్వం ఉండడం లేదు. ఇప్పుడే కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బహిరంగాసభాలలో మాట్లాడేటప్పుడు ఎన్నడు ఉపన్యాసాలలో 'పదార్ధం' ఉండేదికాదు. ఏనాడు ఎ విషయం చెప్పిన క్లారిటీ ఉండక దాన్ని ఎలా ప్రెసెంట్ చేయాలో విలేఖరులు తలలు పట్టుకున్న రోజులున్నాయి.
ఈ ఉప ఎన్నికలలో ఎక్కడా కచ్చితంగా గెలిచే సీట్ లేక చంద్రబాబు జుట్టుపీక్కొంటున్నాడు. ఏ మాత్రం ఓటమి చవిచూసిన 2014 ఎన్నికలకు ఒక్క నాయకుడు కూడా మిగలక పోవచ్చు. ఈ భయం చంద్రబాబులో బాగా ఉంది. కొత్త రక్తం పార్టీలోకి బాబును చూసి భయపడి ఎవ్వరు రావడం లేదు. విజయవాడ ప్రాంతంలో ఉన్న కొద్ది యువ రక్తం కూడా పార్టీని వదిలిపెట్టే యోచనలో ఉంది. పార్టీలో ఒకరి మీద ఒకరికి అసూయా. ద్వేషము ఉండడం వల్లనే పార్టీ ఎదగలేక పోతోంది.
హరికృష్ణ, జూనియర్ NTR లు కూడా చంద్రబాబంటే అంత మక్కువగా లేరు. బాలకృష్ణ ఒక్కరే చంద్రబాబు ను కాపాడలేరు. ఆయన మాట్లాడితే ఆయనకు తప్ప వేరే వారికి అర్ధం అయ్యే పరిస్తితి లేదు. చాల మంది ఈ ఉప ఎన్నికల వరకు వేచి చూస్తున్నారు. చంద్రబాబు తానొక్కడే నాయకుడునన్న ధోరణి నుంచి బయటపడకపోతే పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమే.
No comments:
Post a Comment