Sunday, February 28, 2010

Is Telangaana agitation going wrong way?

ఆంద్ర పారిశ్రామిక ఉత్పత్తులను తెలంగాణా పోలటికాల్ జెఎసి బహిష్కరించడం ఓ వింతగా ఉంది. వారి విధానం చూస్తుంటే రాష్ట్ర విభజనకు సంభందించిన ఉద్యమం గా దీనిని వారు చూడడం లేదని దేశ విభజన ఉద్యమం గా భావిస్తున్నారని అనుకోవలసి వస్తోంది. రాష్ట్రం విడిపోవాలని ఉద్యమం జరుగుతున్నపుడు ఇరువైపులా ఆవేశా కావేసాలు సహజం. అంతమాత్రాన ఒక ప్రాంతం లో తయారైన వస్తువులను ఉపయోగించరాదంటూ వాటిని తగులబెట్టడం ఎంతవరకు సమంజసం? ఇంత కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? ఇది కచ్చితంగా అమాయకులైన తెలంగాణా ప్రజలను మోసం చయడం, మభ్య పెట్టడం కాదని ఎవరైనా అనగలరా? ఉద్యమం ఎంత హుందాగా చేస్తున్నారన్న విషయాన్ని గూడా ఇతర ప్రాంత ప్రజలు గమనిస్తుంటారు. ఇటువంటి పోకడలను చూసి నాగరికులైన పాశ్యాత్యులు మనలను చూసి నవ్వుకుంటారు, జాలిపడతారు. హైదరాబాదు దేశం గా ఉన్న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య ఉద్యమం అలనాడు సంపూర్ణంగా చేసేందుకు అవకాసం లేకపాయింది. ఆరకమైన ఉత్స్తహాన్ని ఇప్పుడు ఈ రకం గా తీర్చుకొంతున్నట్లుగా ఉంది. దేశ స్వాతంత్ర్య ఉద్యమం వేరు ప్రత్యెక రాష్ట్ర సాధన ఉద్యమం వేరు కదా. విజ్ఞానం భోధించాల్సిన గురువులే ఈ రకమైన పిలుపులను ఇచ్చి అమాయకులైన తెలంగాణా ప్రజలను రెచ్చ గొట్టడం తగునా?
పెట్టుబదిదరులంటూ ఆంధ్రా వారిని తూలనాడుతున్నాడటం తగునా. ప్రత్యెక తెలంగాణా ఏర్పడినతరువాత పెట్టుబడులు పెట్టమని  ఆంధ్రా వారి వద్దకు రాకున్నా వేరే ప్రాంతాలవారిని వేడుకోరా? పెట్టుబడులు లేకుండానే, పరిశ్రమలు రాకుండానే అభివ్రుది సాధిస్తారా.
ఇంత గొడవ జరుగుతున్న తరువాత ప్రత్యెక రాష్ట్రం రాక మానదు. వచ్చే ముందు ఎందుకు ఇంత ఆవేశం? తెలంగాణా వచినంత మాత్రాన ఆంధ్రా-రాయలసీమ ప్రజలు తిబ్ది లేక చ్చచ్చి పోరు. వారి బతుకును వారు పోషించ్కోవడానికి ప్రయత్నం చేస్తారు.
నిజానికి ఆంధ్రా వారు కొంతమంది తెలంగాణా వారికి హైదరాబాదు  ఏ నగరమూ అభివృధ్హి చెందనంతగా అభిఫ్రుది చెందినట్లుగా ఒక అభిప్రాయాన్ని కలిగించారు. దాంతో రెచ్చిపోతున్న కొంతమంది తెలంగాణా నాయకులు యిక హైదరాబాద్ మన వశం అయితే అదే పది వేలు అనుకొంటున్నారు.
ఆంధ్రా వారు హైదరాబాదులో ఉండబట్టి 56 సంవచరాలు గడిచినయ్యి కదా. ఒక వేల తెలంగాణా ఏర్పడినతరువాత ఎంతమంది ఇక్కడే ఉండి పోతారూ, ఎన్నికలలో పోతీచేస్తారూ అనే విషయం తర్వాత తెలుస్తుంది. భారత ప్రజాస్వామ్యంలో ఎకడైన జీవించే హక్కు, పోటీచేసే అర్హత రాజ్యాంగం కల్పించ్నపుడు రాష్ట్రాలు విడిపోతే ఏమవుతుంది , కలిసుంటే ఏమవుతుంది?
దేశవిభజన ఉద్యమం లా కాకుండా రాష్ట్ర విభజన ఉద్యమం లా చేస్తే అందరికి మంచిది. ప్రజలకు ఇప్పుడు ఈ ఉద్యమం ఇష్టం అయినంత మాత్రాన విదిపాయింతరువాత తెలంగాను ఎవరు అభివ్రుది చేయగలరని భావిస్తే వారికే వోటు వేస్తారు. అప్పుడు గతంలో వారు అంద్రావార, తెలంగాణా వార అని చూడరు.

No comments: