Thursday, April 5, 2012

TELUGU PRAJALU ENTA DURADRUSTAVANTULU


ఆంధ్రప్రదేశ్ పాలకులకు ప్రజలు  పరిపాలన అంటే చాలా తేలిక భావం ఉన్నట్లు కనపడుతోంది. బొత్స సత్యనారాయణ లాంటి వాడిని ప్రదేశ్ కాంగ్రెస్స్ అధ్యక్ష్డుగా తెలిసి ఎవ్వరు పెట్టారు. జాతీయ పార్టీ ఐన కాంగ్రెస్స్ ఇంత చీప్ రాజకీయ నాయకుడిని ఏకంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిదంటే పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పార్టీ మీద ఎంత అవగాహన , కమాండు ఉన్నదో అర్ధమవుతోంది. ముఖ్యమంత్రి  కిరణ్కుమార్ రెడ్డి కి రాజకీయంగా పెద్ద పలుకుబడి ప్రజల్లో లేదన్న విషయం అందరికి తెలుసు. ఐతే బొత్స సత్యనారాయణ అంత చీప్ మనిషి మాత్రం కాదు. కాస్త మర్యాద, మన్నన  తెలిసినవాడు. ఇటువంటివాడు  బొత్స లాంటి వాని ముందు పరిపాలన సాగించడం కొద్దిగా  కష్టమే. బ్రాంది షా పులమీద షాపులు పెట్టుకొని బతికేవాడికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ పరువు ఎలా బతికి బట్ట కడుతుంది. ఎంతో ఆదరించి పదవులు ఇచ్చిన వై ఎస్స్ రాజశేఖర రెడ్డినే చనిపోయినతరువాత నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే కిరణ్కుమార్ రెడ్డి ఎంత?
బొత్స సత్యనారాయణ అనేకసార్లు తన సొంత జిల్లాలో విజయం సాధించవచ్చు. జిల్లాలో అతనికి ఉన్న పేరేమిటి? ఒక రౌడి లాగ ప్రవర్తిచడం తప్ప గౌరవనీయ రాజకీయ నాయకునిగా ఎవరైనా గుర్తిస్తారా?
రాజశేఖర రెడ్డి ఇతనికి చాలా గౌరవం ఇచ్చి తప్పుచేశాడు. ఆయన బతికికుంటే ఇలా మాట్లడdaనుకోండి...
సోనియాగాంధి కి తెలియకపోవడం  ఆజాద్ లాంటి వారిని డబ్బులతోనో లేదా మరోరకంగానో ఆకట్టుకొని ఇటువంటి పదవులు పొందడడం వల్ల భాధలు పాడేది తెలుగు ప్రజలు గాని వారు కాదు కదా.
మద్యం సిండికెట్ల విషయం లో ఇంత నిజాలు బయటపడ్డా కాంగ్రెస్స్ హై కమాండు అతనిపై చర్య తీసుకోలేకపాయిందంటే  ఎంత దౌర్భాగ్యం.
ఇదంతా సిఎం కిరణ్కుమార్ దురదృష్టం? ఇటువంటి సమయం లో సిఎం పదవిని అంటి పెట్టుకొని ఉండాలా?

No comments: