Friday, October 21, 2011

PEACE IN ANDHRA PRADESH


ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ప్రసాంతత వచ్చింది.  నెల రోజులపాటు బస్సులులేక నానా తిప్పలను అనుభవించిన ప్రజలకు బస్సుల సమ్మెను  కార్మికులు వాయిదా వేసుకోవడంతో రోడ్ల మీదకు బస్సులు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొన్నారు. నెలరోజులపాటు హైదరాబాద్ నగరంలో ఆటోలకు ప్రజలు తమ జేబుల్లోని డబ్బులన్నీ ధారపోసారు. 
రైల్రోకో మొత్తానికి తెలంగాణా ఉద్యమాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. కాంగ్రెస్ నాయకులని కూడా ప్రభుత్వం నిష్కర్షగా రైల్రోకోకు ప్రోచ్చహించిన వారినందరినీ అర్రెస్ట్ చేసి గట్టి కేసులను బనైంచటంతో మూడు రోజుల రైల్రోకో రెందోరోజుకే చప్పబడిపోయింది.
ఈ ఉద్యమం చప్పబదిపోవడం చూస్తుంటే మున్ముందు తెలంగాణా ఉద్యమం అంట గట్టిగా ఉండకపోవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ ఉద్యమం చల్లబరచడానికి కేంద్రం తీసుకొంటున్న చర్యలలో భాగంగా  ఈ అనగా తొక్కుడు విధానం అనుకొన్నా తెలంగాణా రాష్ట్రం ఇవ్వటంలో ఇచ్చ్పుచ్చుకొనే విధానంలో వ్యవహరించేందుకు తెలంగాణా వాదులపై తీసుకొంటున్న చర్యలేమోనని భావించవచ్చు.
హైదరాబాద్ విషయం లో తెలంగాణా వాదులు పడుతున్న పట్టును ఈ రకంగా కేంద్రం తగ్గించవచ్చు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగానో లేదా జాయింట్ కాపిటల్గా ఉంచే విధంగా తెలంగాణా వాదులను ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదని ప్రతిఒక్కరు భావిస్తున్నారు.
ఎదయితేనేమి సమ్మె తో విసిగిపోయిన ప్రజలకు ఇదొకమంచి సుభ పరిణామమే.

No comments: